రహదారి బాగుందా.. పగుళ్లు ఏర్పడ్డాయా?

25 Feb, 2022 06:26 IST|Sakshi
జాతీయ రహదారిని పరిశీలిస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ రోషన్‌ కుమార్‌  

వెల్దుర్తి(తూప్రాన్‌): మాసాయిపేట మండల పరిధిలోని జాతీయ రహదారి 44ను గురువారం సాయంత్రం నేషనల్‌ హైవే అథారిటీ చీఫ్‌ ఇంజనీర్‌ రోషన్‌ కుమార్‌ ఆకస్మికంగా సందర్శించారు. రహదారి బాగుందా.. ఎక్కడైనా పగుళ్లు, గుంతలు ఏర్పడ్డాయా, రహదారిపై వంతెనలు సర్వీస్ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. రోడ్డుపై అక్కడక్కడ మట్టి పేరుకుపోవడాన్ని గమనించారు.

మాసాయిపేట శివారులో ఓ దాబా నిర్వాహకులు సర్వీస్ రోడ్డును ఆక్రమించి పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పరిస్థితిపై నేషనల్‌ హైవే అథారిటీ అధికారులకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. 

మరిన్ని వార్తలు