జాతీయ సమైక్యత దినోత్సవం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

16 Sep, 2022 20:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రేపు(17 సెప్టెంబర్‌ 2022) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌ల‌కు శ‌నివారం సెల‌వు ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్య‌త‌ వజ్రోత్సవాలు అట్ట‌హాసంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 17 జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ శనివారం ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. అనంత‌రం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ప్రారంభిస్తారు. త‌ర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు.
చదవండి: హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?

మరిన్ని వార్తలు