నేచురల్ డై హ్యాండ్‌మేడ్ ఎగ్జిబిషన్, వర్క్‌షాప్‌ 

14 Jun, 2022 13:26 IST|Sakshi

సాక్షి, తెలంగాణ: ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్ ఆధ్వర్యంలో జూన్ 17-19 వరకు మూడు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది. హైదరాబాద్‌కు ప్రత్యేకమైన సహజ రంగులతో, చేతితో తయారు చేసిన వస్తువులు కొలువు దీర నున్నాయి.బంజారాహిల్స్‌లోని తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్‌లో తొలిసారిగా  ‘నేచురల్ డై హ్యాండ్‌మేడ్ ఎగ్జిబిషన్‌’  పేరుతో దీన్ని   నిర్వహించ నున్నారు. 

ముఖ్యంగాకరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభంతో అనేక ఇబ్బందులు పడుతున్న హస్తకళా కారులు, ఉత్పత్తులకు చేయూతనివ్వడంతోపాటు, స్వదేశీ బ్రాండ్ ఉత్పత్తిని  ఏకతాటి పైకి తీసుకురావాలనేది తమ ధ్యేయమని నిర్వాహకులు ఒక ప్రకటనలో  తెలిపారు.  ఈ ప్రదర్శనలో బెంగాల్ మస్లిన్, జమ్దానీ, కౌడి ఆర్ట్, కాలా కాటన్, లంబాడీ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఇతర సహజ రంగుల వస్త్రాలుంటాయి.  పురుషులు, మహిళలు, పిల్లలకు వివిధ రకాల వస్త్రాలతోపాటు ప్రధానంగా చేతితో తయారు చేసిన వస్తువులుంటాయని పేర్కొన్నారు.ఇలాంటి దుస్తులను ధరించడం మనకు గర్వకారణం మాత్రమే కాదు ప్రేమకు సంబంధించిన విషయం. అలాగే కాలుష్య  నివారణలో, మానవ, ఇతర వనరుల దోపిడీని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్‌ భాగస్వాములైన చేనేత కార్మికులు, కళాకారుల, నేత సంఘాలు, గ్రూప్స్‌ ఇందులో పాల్గొంటాయి.  

మిషన్ సమృద్ధిపథకంలో భాగంగా ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్, ‘S.A.L.T (సస్టైన్. యాక్ట్. లైవ్. ట్రాన్స్‌ఫార్మ్) స్టోరీస్‌లో మూడవ ఎడిన్‌లో దేశవ్యాప్తంగా  ఉత్పత్తైన అద్భుత దుస్తులను,  కళాఖండాలను వెలుగులోకి  తేనున్నారు. జూన్ 17 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు చెందిన మాజీ మిసెస్ ఇండియా, శిల్పా రెడ్డి డాక్టర్ రామాంజనేయులు (సీఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), మీనా అప్నేందర్ (క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ),దుర్గా వెంకటస్వామి (స్థాపకుడు, బ్లూ లోటస్)తో కలిసి ఈఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. అలాగే నాగేంద్ర సతీష్, ప్రొఫెసర్ శారదా దేవి, డాక్టర్ షర్మిలా నాగరాజు, అనంతూలాంటి నిపుణులు ఈ దుస్తుల ఉత్పత్తి విధానం, ప్రయోజనాలు, కళాకారులు కష్టాలు జీవనోపాధి అవకాశాలపై ప్రసంగిస్తారు.

ఈ ప్రదర్శనతోపాటు,జూన్ 17న హ్యాండ్ స్పిన్నింగ్ వర్క్‌షాప్, జూన్ 18న నేచురల్ డైయింగ్ వర్క్‌షాప్ ఉన్నాయి. వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవడం అవసరం. రిజిస్ట్రేషన్‌, ఇతర సందేహాల నివృత్తి కోసం 7305127412ను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు