Hyderabad: అలరించిన నాట్యతోరణం 

12 Dec, 2021 12:11 IST|Sakshi
మాదాపూర్‌ సీసీ ఆర్టీలో నాట్య తోరణం పేరిట ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు  

సాక్షి,  మాదాపూర్‌(హైదరాబాద్‌): నాట్య తోరణం పేరిట ప్రదర్శించిన  నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌) సెంటర్‌లో శనివారం అమ్రిత కల్చరల్‌ అధ్వర్యంలో దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నాట్య తోరణం పేరిట పలు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు.  

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ , విదేశీ కామన్వెల్త్‌ ఆఫీస్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, విశ్రాంత ఐఎఎస్‌ అధికారి, డాక్టర్‌ ఎస్‌ చెల్లప్ప, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కూచిపూడి, భరతనాట్య , విశారదుడు పసుమర్తి రామలింగశాస్త్రి,  ఒడిస్సీ నాట్య విదుషీమణి నయనతార నందకుమార్, సీసీఆర్‌టీ ప్రత్యేక అధికారి తాడేపల్లి సత్యనారాయణ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని  ప్రారంభించారు.  

కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. భార్గవి పగడాల(హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. మురమళ్ల సురేంద్రనాథ్‌చే కూచిపూడి నృత్య ప్రదర్శన, నిదగ కరునాథ్‌చే కథక్, అభయాకారం కృష్ణన్‌ భరతనాట్య ప్రదర్శన, బిజినచే మోహినియట్టం తదితర నృత్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల గౌరవ పూర్వకంగా సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందదని పేర్కొన్నారు. దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు