కార్మిక నేతకు తుది వీడ్కోలు

23 Oct, 2020 01:49 IST|Sakshi
నాయిని అంత్యక్రియల్లో పాడె మోస్తున్న మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌

మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు

పాడె మోసిన మంత్రి కేటీఆర్‌

నాయినికి నివాళులర్పించిన ప్రముఖులు 

సాక్షి, హైదరాబాద్‌: కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియ లు గురువారం మధ్యాహ్నం ఫిలింనగర్‌ మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నాయి ని మృతి చెందినట్లుగా అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, అభిమానులు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని నాయిని కుటుంబసభ్యులను పరామర్శించారు. తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఆయన పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహి ల్స్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని నాయిని నివాసానికి తరలించారు.

అప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఇంటి వద్ద కడ సారి చూపుకోసం వేచి ఉన్నారు. నాయిని భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథో డ్, ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మినిస్టర్‌ క్వార్టర్స్‌ నుంచి నాయిని అం తిమ యాత్ర ప్రారంభమైంది. మహాప్రస్థానంలో నాయిని పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్‌.. పాడె కూడా మోశారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాయిని చితికి కుమారుడు దేవేందర్‌రెడ్డి నిప్పంటించారు.  

ఆస్పత్రి నుంచి భార్య..  
నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాయినితో పాటు ఆమె కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆస్పత్రి వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో ఆమె ను మినిస్టర్‌ క్వార్టర్స్‌కు తీసుకురాగా భర్త భౌతిక కాయాన్ని చూసి రోదించారు. అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి నాయిని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు.   

కార్మిక సమస్యల పరిష్కారంలో నాయిని కృషి చిరస్మరణీయం
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువు రు ప్రముఖులు సంతాపం తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘స్నేహశీలి నాయిని ఆ త్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయం’’అని వెంకయ్య తన సందేశంలో పేర్కొన్నారు. 

పలువురి సంతాపం 
నాయిని నర్సింహారెడ్డి మృతికి శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్‌రెడ్డి,  ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ యాధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్‌ఎంపీ కోమ టి రెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వినో ద్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సీపీఐ నేతలు సురవరం సుధాకరరెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు, ప్రొఫెసర్‌ కోదండరామ్, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, టీచర్‌ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, టీఎన్జీఓ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మరో నేత కారం రవీందర్‌రెడ్డి  సంతాపం ప్రకటించారు. కాగా, నాయిని పార్థివదేహానికి డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. హాం మంత్రిగా ఉన్నప్పుడు నాయిని పోలీసుశాఖకు ఎన్నో సేవలు చేశారని డీజీపీ గుర్తు చేసుకున్నారు.  

ప్రతీక్షణం తెలంగాణ కోసం ..
నాయిని తన జీవితంలో ప్రతీక్షణం తెలంగాణ కోసం శ్రమించారు. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. నాయిని మృతితో తెలంగాణ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది
– గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌  

మరచిపోలేని అనుబంధం 
నాయిని మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంలో నాయినితో కలిసి పనిచేసిన అనుబంధం మరచిపోలేనిది. ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.
– సీఎం కేసీఆర్‌

ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
నాయిని మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం అత్యంత బాధాకరం అని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని ఓ గొప్ప కార్మిక నాయకుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

జననాయకుడు 
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెంట నిలిచిన జన నాయకుడు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోం మంత్రిగా మనందరి మనసులో నాయిని నర్సింహారెడ్డి చిరస్థాయిగా నిలచిపోతారు.
– మంత్రి కేటీ రామారావు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు