నాయిని అంత్యక్రియలు: పాడె మోసిన కేటీఆర్‌

22 Oct, 2020 15:26 IST|Sakshi

మహాప్రస్థానంలో ముగిసిన నాయిని అంత్యక్రియలు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్న్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనలతో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పడలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌.. పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. కరోనా అనంతరం అనారోగ్యం పాలైన నాయిని.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు