శివయ్యా.. నా వల్ల కాదయ్యా!

16 Feb, 2023 13:50 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు.

ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. 

మరిన్ని వార్తలు