వెల్కటూరులో కొత్త రాతియుగం ఆనవాళ్లు 

8 Mar, 2021 08:11 IST|Sakshi

సిద్దిపేట‌: సిద్దిపేట అర్బన్‌ మండలం వెల్కటూరు గ్రామంలో మానవ సాంస్కృతిక వికాసాలను ప్రతిబింబించే కొత్తరాతియుగం నాటి శిల్పాలు లభించాయి. ఇంత వరకు గ్రామస్తులకు మాత్రమే తెలిసిన ఈ చరిత్రను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. గతంలో ఇక్కడ చారిత్రక పూర్వయుగం, కొత్తరాతియుగం ఆనవాళ్లు లభించినట్టు తెలిపారు. అందులో 10 నాగశిల్పాలు, రెండు వీరగల్లులు, రెండు జైన శిల్పాలు ఉన్నాయి.

జైన ద్వారపాలకుల శిల్పాలు అత్యంత శిల్ప సౌందర్యంగా ఉన్నట్టు తెలిపారు. వీరు జంధ్యాలు కుడి వైపు ధరించి ఉన్నట్టు తెలిపారు. వీరశైవ భక్తుల ప్రతిమ లక్షణాలను కలిగిన రెండు విగ్రహాలు ఆత్మాహుతి చేసుకుంటున్న దృశ్యాన్ని చూపే విధంగా ఉన్నట్టు తెలిపారు. వీరశైవుల వీరభక్తికి సాక్ష్యాలుగా ఈ విగ్రహాలు ఉన్నట్టు తెలిపారు. ఇలా మరుగున పడిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు