కొత్తగా 119 బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీలు!

22 Nov, 2022 02:50 IST|Sakshi

పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం

2023–24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి..

వీటి ఏర్పాటుకు భవనాల అన్వేషణలో సొసైటీ అధికారులు

బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని విద్యా సంస్థలు..

పాఠశాలలు    292

కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయినవి  140

కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్‌ కానున్నవి  119

డిగ్రీ కాలేజీలు  34

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతు­ల విద్యార్థులకు మరిన్ని గురుకుల జూనియర్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రభుత్వం మరో 119 బీసీ జూనియర్‌ కాలేజీలను  ఏర్పాటు చేయనుంది. ఇందు లో భాగంగా  119 గురుకుల పాఠశాలలను  అప్‌గ్రేడ్‌ చేయనుంది. దీంతో ఈ పాఠశాల ల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తరగతులు నిర్వహిస్తారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కాను­న్నాయి. ఇందుకు సంబంధించి ప్రభు త్వం ఆమోదం తెలపడంతో కాలేజీల ఏర్పా టుకు మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

అద్దె భవనాల కోసం అన్వేషణ..
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవ లం 21 గురుకుల విద్యా సంస్థలు మాత్ర మే ఉండేవి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున రెండు విడతల్లో 238 గురుకుల పాఠశా­లలను మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో డిమాండ్‌ విప రీతంగా ఉండటంతో ఇటీవల జిల్లాకు ఒక గురుకులం చొప్పున మరో 33 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది.

గత నెలలో సొసైటీ అధికా­రులు ఈ పాఠశాల లను ప్రారంభించారు. వీటికి తోడుగా మరో 15 గురుకుల డిగ్రీ కాలేజీలను సైతం అందుబాటులోకి తెచ్చా­రు. విడతలవారీగా యుద్ధప్రా­తిపదికన ఏర్పాటు చేసిన పాఠ శా లలకు ప్రభుత్వం ఇంకా శాశ్వత భవనాలను నిర్మించకపోవ­డంతో అవన్నీ అద్దె భవనా ల్లోనే కొనసా­గుతున్నాయి.  కొత్త కాలేజీలు సైతం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది.

దీంతో జిల్లాల వారీగా డిమాండ్‌కు తగినట్లు భవనాలను గుర్తించేందుకు సంబంధిత జిల్లా సంక్షేమాధికారి, గురుకుల పాఠశాలల ప్రాంతీయ సమన్వ యకర్తలకు విద్యా సంస్థల సొసైటీ బాధ్య తలు అప్పగించింది. పాఠశాల స్థాయిలో గురుకుల భవనానికి 20 వేల చదరపు అడు గుల స్థలం అవసరం ఉండగా.. కాలేజీతో కలిపి 50 వేల చదరపు అడుగుల భవనం అవసరమని అధికారులు  అంచనాకు వచ్చా­రు.

ఈ మేరకు పెద్ద భవనాల కోసం ప్రయ­త్ని­స్తున్నారు. ఈ క్రమంలో మూత­బడ్డ ఇంజనీరింగ్‌ కాలేజీలు, కార్పొరేట్‌ విద్యా సంస్థల భవనాలు ఖాళీగా ఉంటే వాటి­కి ప్రాధా న్యం ఇవ్వాలని సొసైటీ ఆదే­శించడంతో అలాంటివాటిని గుర్తించాలని భావిస్తు న్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖ­రుకల్లా భవనాలను గుర్తించి అగ్రిమెంట్లు చేసుకు నేందుకుగాను ప్రభు­త్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవనాలను గుర్తించి నివేదికలు పంపేందుకు సొసైటీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 

మరిన్ని వార్తలు