మిశ్రమ సూచిక పద్ధతిలో ముడిబియ్యం పరీక్ష 

15 Oct, 2021 02:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కస్టంమిల్డ్‌ రైస్‌(సీఎంఆర్‌) సేకరణలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ దీపక్‌ శర్మ తెలిపారు. సెంట్రల్‌ పూల్‌ సీఎంఆర్‌లో పాత బియ్యం ఆమోదించేందుకు ముందుగా మిశ్రమ సూచిక పద్ధతిలో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీని ప్రకారం సెంట్రల్‌ పూల్‌ కింద సీఎంఆర్‌ సేకరణ కోసం మిల్డ్‌ ముడి బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు.

ఆకుపచ్చ/అవకాడో ఆకుపచ్చలో ఉన్న నమూనాలను మాత్రమే ఆమోదిస్తామని, పసుపు/పసుపు నారింజ/నారింజ తదితర రంగులో ఉన్న నిల్వలను తిరస్కరిస్తామని తెలిపారు. వాటాదారులకు ఈ పద్ధతి గురించి అవగాహన కల్పిస్తామని, తెలంగాణ ప్రభుత్వం భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రాల్లో రైస్‌ మిల్లర్లతో ఈ విధానంపై అవగాహన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.    

మరిన్ని వార్తలు