కరోనాకు కొత్త కొమ్ములు

23 Dec, 2020 04:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లండన్‌లో బయటపడి పలు దేశాలకు విస్తరించిన కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త రకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుండగా, ఇందుకు తగిన ఆధారాలు, సమాచారం చూపాలని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఈ కొత్త రకం వైరస్‌ మరింత తీవ్రమైందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగపు ముఖ్యాధికారి మైకేల్‌ ర్యాన్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించ కూడదని నిర్ణయించుకున్నామని అమెరికా వ్యాక్సిన్‌ నిపుణుడు ఆంథోనీ పాసీ ప్రకటిం చారు. ఇప్పటివరకు 1,000 మంది ఈ రూపాం తర వైరస్‌ బారిన పడగా నలుగురు మాత్రమే మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉండేలా వ్యాధి కారక వైరస్‌లలో జన్యుమార్పులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. అయితే గతంలో రూపాంతర వైరస్‌ కారణంగా వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ‘వీయూఐ 202012/01’వైరస్‌ సోకిన వారి పరిస్థితి ఏంటన్నది నిశితంగా గమనించాల్సి ఉంది. చదవండి: (కొత్త రకం కరోనా: భారత్‌లో ఆందోళన అవసరం లేదు!)

జన్యుమార్పులు ఎలా?
శరీరంలోకి చేరిన వైరస్‌ వేగంగా తన నకళ్లను తయారు చేసుకుంటుందని తెలిసిందే. ఒక వైరస్‌ రెండుగా విడిపోయే క్రమంలో సహజసిద్ధంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు వైరస్‌ మనుగడకు ఉపయోగపడకపోతే అవి మరణిస్తాయి. ఈ ఏడాది జనవరిలో తొలిసారి గుర్తించిన సార్స్‌ సీవోవీ–2 వైరస్‌ పలు ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా.. అనేక మార్పులకు గురయ్యాయి. సాధారణంగా జనాభాలో అత్యధికుల్లో పాత వైరస్‌ లేదా ఇతర వ్యాధులకు వేసిన టీకాల వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో యాంటీబాడీల ఉత్పత్తి జరిగి ఉంటే వాటిని అధిగమించి మనుగడ సాగించేందుకూ ఈ జన్యుమార్పులు దోహదపడతాయి. కాకపోతే ఇందుకు చాలా సమయం పడుతుంది.

‘వీయూఐ 202012/01’వైరస్‌ ఉనికి అక్టోబర్‌ నుంచి క్రమేపీ పెరుగుతుండటాన్ని బట్టి చూస్తే ఇది నిలకడ కలిగిందని తెలుస్తోంది. ఈ వైరస్‌ ఉన్న రోగులను పరిశీలించగా, వైరస్‌లో మొత్తం 23 జన్యుమార్పులు ఉన్నట్లు తెలిసింది. జన్యుక్రమంలో రెండు చోట్ల (పొజిషన్‌ 69/70, 144/145) తొలగింపులు ఉండటం వ్యాధి వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమని నిపుణుల అంచనా. కొమ్ములోనే అధిక జన్యుమార్పుల వల్ల వైరస్‌ నకళ్లు ఏర్పడే వేగం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్‌కు చెందిన నిపుణుల బృంద సభ్యుడు వెండీ బార్క్‌లే అంటున్నారు. వ్యాప్తి వేగం మునుపటి వైరస్‌ కంటే 71 శాతం ఎక్కువగా ఉందని వివరించారు. చదవండి: (బ్రిటన్‌ నుంచి ముంబైకు ఐదు విమానాలు!)  

ఆ మూడింటి విషయంలో జాగ్రత్త..
కోవిడ్‌ నియంత్రణ కోసం మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. త్రీసీలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. గాలి, వెలు తురు సక్ర మంగా లేని చోట్ల గుమి కూడకపోవ డం (క్లోస్డ్‌ స్పేసెస్‌), జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరక్కపోవడం (క్రౌడెడ్‌ స్పేసెస్‌), సన్నిహితంగా మెలగకపోవడం (క్లోజ్‌ కాంటాక్ట్‌)లను జాగ్రత్తగా పాటించాలని వివరిస్తున్నారు.

వదంతులు నమ్మకండి
కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి ఇంకా తెలియాల్సిన అంశా లు చాలా ఉన్నాయని, అంత వర కూ ప్రజలు వదంతులు నమ్మ కూడదని, జాగరూకతతో వ్యవ హరించాలని జస్లోక్‌ ఆసుపత్రి సాం క్రమిక వ్యాధుల విభాగపు అధ్య క్షుడు డాక్టర్‌ ఓం శ్రీవాత్సవ స్పష్టం చేశారు. కొత్త రకం వైరస్‌ కార ణం గా వచ్చే వ్యాధి లక్షణాల్లో పెద్ద తేడాలేమీ లేవని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు అవ సరమైన నిబంధనలు పాటించడం ద్వారా కొత్త రకం వైరస్‌ను కట్టడి చేయొచ్చని అన్నారు.  

మరిన్ని వార్తలు