లోన్‌యాప్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

2 Jun, 2021 21:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌యాప్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. లోన్‌యాప్స్‌ ఎండీ దగ్గర నుంచి ఈడీ అధికారి లంచం తీసుకున్నట్లు తేలింది. ఈడీ అధికారిగా పనిచేస్తున్న లలిత్‌ బజార్డ్‌ అనే వ్యక్తి బెంగళూరులో రూ. 5లక్షల లంచం తీసుకున్నారు. లంచం తీసుకున్న సదరు అధికారి  సీసీఎస్‌ అధికారులు ఫ్రీజ్‌ చేసిన ఖాతాలను తెరిపించే ప్రయత్నం చేశాడు. బెంగళూరులోని ఓ బ్యాంకులో లావాదేవీలు జరిగినట్లు తేలింది.

కాగా ముంబైకి చెందిన అపోలో ఫైన్‌వెస్ట్‌ ఎండీ దగ్గర నుంచి లలిత్‌ లంచం తీసుకున్నారు. బెంగళూరులోని పలు బ్యాంక్‌లకు లలిత్‌ తప్పుడు పత్రాలు ఇచ్చి డబ్బులు రిలీజ్‌ చేయించారు. కాగా ఈడీ అధికారి బాగోతంపై హైదరాబాద్‌ పోలీసులు సీబీఐకి సమాచారం ఇవ్వడంతో బెంగళూరులో లలిత్‌ బజార్డ్‌పై కేసు నమోదు చేశారు.  


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు