కొత్త రకం వానలివి!

21 Oct, 2020 02:01 IST|Sakshi

బంగాళాఖాతం నుంచి అరేబియా చేరుతున్న అల్పపీడనాలు

అరుదైన వాతావరణ దృగ్విషయం

2007 తర్వాత  ఈ ఏడాదే ఏర్పడ్డ వింత 

సాక్షి, హైదరాబాద్‌: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి.. కేరళ నుంచి గుజరాత్‌ వరకు వానలు పడితే.. అది నైరుతి రుతుపవనాలు అని చెప్పుకొంటాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపానులు, అల్పపీడనాలతో వానలు కురిస్తే ఈశాన్య రుతుపవనాలు.. మరి ఎక్కడో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో పశ్చిమ తీరంలోని గుజరాత్‌లో వానలు కురిస్తే..! ఇదిగో ఇలాంటి అరుదైన, వింత వర్షాలు కురుస్తున్నాయి ఈ ఏడాది. ఈ పరిణామానికి పేరేమీ లేదు కానీ.. వాతావరణ విచిత్రాల్లో ఇదీ ఒకటిగా మాత్రం చూడాల్సి ఉంటుంది. గత 20 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ఇలా జరిగిందట. 

రెండు రుతుపవనాలకు కాస్త భిన్నం.. 
ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ప్రభావం చూపే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరంతో పాటు ఈశాన్య, మధ్య భారతాన్ని వానలతో నింపితే.. ఆ తర్వాత తూర్పు తీరం వెంబడి వానల ప్రభావం చూపేందుకు ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. గాలి వీచే వేగం, దిశల్లో మార్పుల్లేని కారణంగా ఈ దృగ్విషయాల్లో తేడాలు చాలా తక్కువే. కానీ ఈ ఏడాది చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రభావం గుజరాత్, రాజస్తాన్‌ల వరకూ విస్తరించింది. వాతావరణ వ్యవస్థలు (అల్పపీడం, తుపానులు వంటివి) బలంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటాయని, కాకపోతే చాలా అరుదుగా జరుగుతుందని దేశంలో తొలి వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్‌కు చెందిన శాస్త్రవేత్త పల్వట్‌ మహేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 2007లో యామిన్‌ తుపాను చూసుకుంటే.. బంగాళాఖాతంలో పుట్టి.. గుజరాత్‌ మీదుగా అరేబియా సము ద్రం దాటి పాకిస్తాన్‌లోని కరాచీ వరకూ సా గింది. జూన్‌ 17న దీన్ని తొలిసారి గుర్తించా రు. ఆ తర్వాత ఏపీలోని కాకినాడ వద్ద తీరం దాటడంతో బలహీనపడుతుందని వాతావర ణ నిపుణులు అంచనా వేశారు. కానీ జూన్‌ 26 నాటికి ఇది కరాచీ చేరుకుని అక్కడ భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుపాను కారణంగా భారత్‌లో దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోగా.. పాక్‌లో 213 మంది చనిపోయా రు. యామిన్‌ తర్వాత అంతటి బలమైన వా తావరణ వ్యవస్థ ఏర్పడటం ఇదే తొలిసారి. 

గాలి దిశలో మార్పు ప్రభావం.. 
సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభా వం తెలంగాణ, విదర్భ ప్రాంతాల వరకు కన్పిస్తుంది. ఈ కారణంగానే సెప్టెంబర్, అక్టోబర్‌ తొలి 2 వారాల్లో అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నేలపై గాలి వాయవ్య దిశగా వీస్తూ ఉండటం వల్ల.. వాతావరణ వ్యవస్థ నేలపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఫలితం గా బలహీనపడేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉంటాయి. అయితే ఈ ఏడాది గాలి వా యవ్యం వైపు కాకుండా పశ్చిమం వైపు తిరగడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగని అన్ని అల్పపీడనాలు గుజరాత్‌ వర  కు ప్రయాణిస్తున్నాయా.. అంటే అదీ లేదు. ఆగస్టులో దాదాపు 5 అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ వాటిల్లో బలమైనవి ఏవీ లేవు. కొన్ని తెలంగాణ వరకూ ప్రయాణించాయి. మరికొ న్ని విదర్భ అంచులు తాకాయి. కానీ అక్టోబర్‌ లో ఏర్పడ్డ అల్పపీడనం మాత్రం గుజరాత్‌ వ రకు ప్రయాణించింది. 2007, 2020 రెండిం టిలోనూ సూర్యుడిపై ఏర్పడే మచ్చల (పే లుళ్ల ఫలితంగా నల్లగా కనిపించే ప్రాంతాలు) తక్కువగా ఉండటం కొసమెరుపు! 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు