సచివాలయం కూల్చివేతపై కౌంటర్‌ ఇంకెప్పుడు వేస్తారు?: ఎన్‌జీటీ

26 Nov, 2021 10:39 IST|Sakshi

కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌: సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్‌) కౌంటర్‌ వేయకపోవడంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దాదాపు 50 శాతానికిపైగా కొత్త భవనాల నిర్మాణం పూర్తయినా ఇంకా కౌంటర్‌ దాఖలు చేయరా?’అని నిలదీసింది.

డిసెంబర్‌ 17లోగా కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. నిబంధనల మేరకు అనుమతులు తీసుకోకుండానే పాత సచివాలయాన్ని కూల్చేశారని, కొత్త నిర్మాణాలకు సరైన అనుమతులు లేవని రేవంత్‌ వేసిన పిటిషన్‌ను ఎన్‌జీటీ ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కొత్త సచివాలయం నిర్మాణం కోసమే పాత సచివాలయాన్ని అనుమతుల్లేకుండా కూల్చివేశారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ నివేదించారు.
(చదవండి: కొత్త పంట గెర్కిన్‌.. లక్షల్లో ఆదాయం)

మరిన్ని వార్తలు