గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి

16 May, 2022 09:46 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

‘కస్తూరిబా’లోకి సైతం వెళ్తున్న వైనం

గత గురువారం, తాజాగా శనివారం రాత్రి

భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు, పోషకులు

సాక్షి, నిర్మల్‌: సారంగపూర్‌ మండలంలోని జామ్‌ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయంతో పాటు అదే ప్రాంగణంలోని కస్తూరిబా విద్యాలయంలో శనివారం ఓ అగంతకుడు చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదుల్లో సంచరించాడు. గత గురువారం సైతం ఇదే విధంగా రావడంతో గమనించిన సిబ్బంది, విద్యార్థులు కేకలు వేశారు. వెంబడించడంతో పరారయ్యాడు. శనివారం రాత్రి సేమ్‌ సీన్‌ రిపీట్‌ కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి అక్కడికి చేరుకుని వి ద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. అగంతకుడు కేజీబీవీ వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై  గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రాగ లతను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి రెండు సార్లు వచ్చిన విషయం వాస్తవమేనని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కేజీబీవీ ఎస్‌వో అన్నపూర్ణను వివరణ కోరగా.. వెనుకవైపు ప్రహరీని మూపివేయకపోవడంతో అగంతకుడు లోనికి వ చ్చాడని, ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు