గోమయంతో ప్రమిదలు.. ఎలా తయారు చేస్తారంటే!

21 Oct, 2022 16:41 IST|Sakshi

పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలన్న సంకల్పంతో నిర్మల్‌ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్‌ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో గోమయ ప్రమిదలు తయారు చేస్తున్నారు. నిర్మల్‌  జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ ఫంక్షన్‌ హాల్లో వీటిని తయారు చేస్తున్నారు.


నాటు గోవుల నుంచి మాత్రమే సేకరించిన పేడను బాగా ఎండబెడతారు. అనంతరం దాన్ని పొడిచేసి గోమూత్రం, ముల్తానీ మట్టి, చింత గింజల పొడి కలిపి ముద్ద చేస్తున్నారు. అచ్చు యంత్రంతో ఆ ముద్ద నుంచి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ ద్వారా 20 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్‌

(క్లిక్‌ చేయండి: రోగులకు ఊరట..పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స)

మరిన్ని వార్తలు