నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి ఆవిర్భావం

4 Sep, 2022 01:24 IST|Sakshi
నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల కమిటీ సమావేశంలో సభ్యులు 

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు పూర్తి చేసుకున్న వేళ..నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ‘నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి’ పురుడుపోసుకుంది. ఈ సమితి సెప్టెంబర్‌ 17 నుంచి ప్రత్యక్ష కార్యా­చరణకు రంగంలోకి దిగనుంది. బేగంపేట­లోని ఓ ప్రైవేటు హోటల్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఉత్సవ సమితి సభ్యుల సమావేశంలో కమిటీని ప్రకటించి పలు తీర్మానాలు చేశారు.

సెప్టెంబర్‌ 17న అన్ని జిల్లాల్లో, రెవెన్యూ మండల కేంద్రాల్లో ప్రముఖులు, యువకులతో ఈ అమృతోత్సవాలను ప్రారంభించి జనవరి 2023లో అన్ని గ్రామాల్లో ‘జనజాగరణ’ ద్వారా తెలంగాణ స్వాతంత్య్ర పోరా­ట స్ఫూర్తిని చాటుతామని రిటైర్డ్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 17, 2023న గ్రామా­ల్లో ఇంటింటికీ త్రివర్ణ పతాక వందనంతో ఈ ఉత్సవాలను ముగిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలతో పాటు రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఉత్సవ సమితి కమిటీ ఇదే..
గౌరవాధ్యక్షుడిగా రిటైర్డ్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా స్వా­తంత్య్ర సమరయోధుడు టీవీ నారాయణ కుమారుడు డాక్టర్‌ వంశ తిలక్, ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ చామర్తి ఉమామహేశ్వరరావు, రిటైర్డ్‌ లేబర్‌ కమిషనర్‌ హెచ్‌కే నాగు, ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగం మాజీ అధిపతి కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మసడి బాపురావు (వరంగల్‌), కార్యదర్శులుగా నిరంజనచారి (కరీంనగర్‌), ఇటిక్యాల కృష్ణయ్య (నల్లగొండ), గడ్డం సరోజాదేవి (మాజీ ఎంపీ వివేక్‌ సతీమణి), కోశాధికారిగా చంద్రశేఖర్‌లతో పాటు మరో 18 మంది సభ్యులు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ 2022–23 ఏడాది కాలం పాటు ఉంటుంది.

మరిన్ని వార్తలు