బోధన్‌ ఏఈ సస్పెన్షన్, కలెక్టర్ ఉత్తర్వులు జారీ

28 Aug, 2020 14:35 IST|Sakshi

సాక్షి, బోధన్‌‌(బోధన్‌): బోధన్‌ పట్టణంలోని పాండుఫారం శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈ నాగేశ్వర్‌రావ్‌ను నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి సస్పెండ్‌ చేశారు. గురువారం తెలంగాణ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల కాంప్లెక్స్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చేపట్టిన పనులకు మెజర్మెంట్‌ బుక్‌లో రికార్డు  చేసిన పనులకు మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి గుర్తించారు.

రికార్డులను నమోదు చేసిన తెలంగాణ రాష్ట్ర ఈడబ్ల్యూఐడీసీ నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన ఏఈ ఎన్‌. నాగేశ్వర్‌రావ్‌ను సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిచేసిన పనులకు సంబంధించిన కొలతల్లో భారీగా వ్యత్యాసం చూపుతూ రికార్డులు నమోదు చేయడం, అధికారులను తప్పుదోడ పట్టించడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈని సస్సెండ్‌ చేసి విచారణకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు తమకు కేటాయించిన విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.  

‌  

మరిన్ని వార్తలు