అమెరికాలో నిజామాబాద్‌ యువకుడి మృతి 

19 Oct, 2021 10:46 IST|Sakshi
సాయి శుశాంత్‌ (ఫైల్‌)

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌కు చెందిన సాయి సుశాంత్‌(30) అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులు సోమవారం తెలిపారు. అమెరికాలోని బీచిగాన్‌ రాష్ట్రంలో పవర్‌ ఇండస్ట్రీలో స్టాఫ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుశాంత్‌ ఈనెల 12న ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నేడు జిల్లాకు మృతదేహం రానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా తండ్రి సుధాకర్‌నాయక్‌ గతంలో బీసీ సంక్షేమశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాడు.  

మరిన్ని వార్తలు