గోదావరిలో ఏడుగురు గల్లంతు, ఆరుగురు మృతి

3 Apr, 2021 01:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ వద్ద గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు నీట మునిగారు. వీరిని గమనించిన స్థానికులు గోదావరిలోకి దూకి గాలింపు చేపట్టారు. ఏడుగురి ఒక వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ముమ్మర గాలింపు అనం‍తరం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా మాక్లూర్‌, డీకంపల్లి, గుత్స, నిజామాబాద్, ఎల్లమ్మగుట్టకు చెందిన జీలకర్ర సురేష్, యోగేష్, బొబ్బిలి శ్రీనివాస్, సిద్ధార్థ్‌, శ్రీకర్, దొడ్లే రాజుగా గుర్తించారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈరోజను ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నదిలోకి జారీపోయారు. వారిని కాపాడేందుకు మరో అయిదుగురు నదిలోకి దిగారు. వారిలో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. 


Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు