టెట్ వాయిదాపై కేటీఆర్‌ ట్వీట్‌.. కుదరదంటూ మంత్రి సబితా రిప్లై

21 May, 2022 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో  టెట్  ఎగ్జామ్  వాయిదా  వేయడం  కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.  ఇతర  కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌  క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్  తేదీ ముందుగానే  ఖరారు  చేసామని ఆమె మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.  

జూన్  12వ తేదీన  రైల్వే  ఎగ్జామ్  ఉన్నందున..  టెట్  ఎగ్జామ్  ను వాయిదా  వేయాలంటూ  ఓ అభ్యర్థి చేసిన ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ మంత్రి  సబితకు  ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాతే ట్వీట్‌ చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దాదాపు 3.5లక్షల  మంది  రాయాల్సి ఉన్న  టెట్  ను అన్ని  పరిగణలోకి  తీసుకునే  ఏర్పాట్లు  చేసామని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు