బ్యాక్‌సైడ్‌లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌..!

9 Feb, 2021 11:45 IST|Sakshi
టీకా తీసుకుంటున్న ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు

సాక్షి, పెద్దపల్లి : కోవిడ్‌ టీకా తీసుకోవడానికి... జిల్లాలోని ఫ్రంట్‌ వారియర్స్‌ నుంచి సరైన స్పందన రావడం లేదు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 17 ఆస్పత్రుల్లో 1,722 మంది ఫ్రంట్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వాలని లక్ష్యం విధించగా, 529 మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. గోదావరిఖని ప్రాంతీయ ఆస్పత్రిలో 150 మందికి కేవలం 38 మంది మాత్రమే టీకా తీసుకున్నా రు. రామగుండం పీహెచ్‌సీలో 100 మందికి 50, ఎన్టీపీపీ ఆస్పత్రిలో 200 మందికి 162, అడ్డగుంటపల్లి యూహెచ్‌సీలో 100 మందికి 32 మందికి, బసంత్‌నగర్‌ పీహెచ్‌సీలో 39 మందికి 25 మంది వాక్సిన్‌ వేసుకున్నారు.

ఓదెల పీహెచ్‌సీలో 67 మందికి 18 మంది టీకా వేసుకున్నారు. ధర్మారం మండలం మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 76 మందికి 26, కమాన్‌పూర్‌ పీహెచ్‌సీలో 38 మంది టీకా వేసుకున్నారు. రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ  ఏసీపీ బాలరాజుతోపాటు ఇద్దరు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, 21 మంది కానిస్టేబుళ్లు, ఒక స్వీపర్‌ టీకా వేసుకున్నారు. టీకా పంపిణీ ప్రక్రియను జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ కృపాబాయి పర్యవేక్షించారు.
చదవండి: కేసీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. అంతా గప్‌చుప్‌
పాత వేపచెట్టు : భారీ జరిమానా

మరిన్ని వార్తలు