‘కరోనా బారిన 1000 మంది బ్యాంక్‌ ఉద్యోగులు’

25 Jul, 2020 17:58 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకుల్లో పనిచేసేందుకు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొందని ఆల్‌ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజు రోజుకు బ్యాంకు ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో చాలా మంది సెలవులపై వెళుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1000 మంది బ్యాంక్‌ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇందులో కొంత మంది చనిపోయారని ఆయన వాపోయారు. బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగులు చనిపోతున్నా శానిటైజేషన్‌ పనులపై దృష్టి పెట్టడం లేదని సంఘం ఆరోపించింది. పనిగంటల్లో వెసులు బాటు కల్పించడంతోపాటు ఆల్టర్‌నేటివ్‌ రోజులలో పనిచేసే వెసులు బాటు కల్పించాలని సంఘం తరపున ఆయన కోరారు. అత్యవసర పరిస్ధితుల్లో పనిచేసే ఉద్యోగులతో సమానంగా తాము పనిచేస్తున్న కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాంబాబు ఆరోపించారు.

మరిన్ని వార్తలు