ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఎత్తివేత 

20 Apr, 2023 08:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ను ఎత్తివేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్‌లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు ఇస్తారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.  కోవిడ్‌ నేపథ్యంలో ఇంటరీ్మడియేట్‌ పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

గతేడాది వరకూ 70% సిలబస్‌ను అమలు చేశారు. దీంతో ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ లేకుండానే ఎంసెట్‌ ర్యాంకులు ఇచ్చారు. కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్‌ మార్కులు ఎక్కువ రావడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అనేక కారణాల వల్ల తక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్‌ ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేసింది.  

మరిన్ని వార్తలు