ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు

16 Feb, 2023 09:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి– హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, హైదరాబాద్‌ స్థానికసంస్థల నియోజకవర్గానికి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 తేదీ వరకు (సెలవు దినాలు మినహా) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.  

ఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులు.. 
►ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల నిర్వహణకు అంశాల వారీగా నోడల్‌ అధికారులను నియమించారు. వివరాలిలా ఉన్నాయి. 
►జి.వెంకటేశ్వర్లు (స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్, భూసేకర ణ): బ్యాలెట్‌పత్రాలు, బ్యాలెట్‌బాక్సుల తయారీ. 
►పి.సరోజ(అడిషనల్‌ కమిషనర్, పరిపాలన): ఎన్నికల సామాగ్రి సేకరణ. 
►సంధ్య(జేసీ, శానిటేషన్‌): ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది. 
►పద్మజ( సీఎంఓహెచ్‌):హెల్త్‌కేర్‌ కార్యక్రమాలు,కోవిడ్‌ నిబంధనలు. 
► కె.నర్సింగ్‌రావు:( డీఈఈ, ఐటీ): వెబ్‌క్యాస్టింగ్,ఐటీ సంబంధిత అంశాలు. 
►శ్రుతిఓజా (అడిషనల్‌ కమిషనర్‌), సౌజన్య( పీడీ), యూసీడీ: శిక్షణ కార్యక్రమాలు 
►ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి (డైరెక్టర్,  ఈవీడీఎం): ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతలు,వాహనాలు 
►మహ్మద్‌ జియా ఉద్దీన్‌(ఈఎన్‌సీ): పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలు 
►ముర్తుజాఅలీ(సీపీఆర్‌ఓ): ఓటరు అవగాహన కార్యక్రమాలు, మీడియాసెల్, పెయిడ్‌న్యూస్‌ 
►బాషా(ఎస్టేట్‌  ఆఫీసర్‌): 24 గంటల ఫిర్యాదుల విభాగం, కాల్‌సెంటర్‌ ఫిర్యాదుల పరిష్కారం  
►మహేశ్‌ కులకర్ణి( చీఫ్‌వాల్యుయేషన్‌ఆఫీసర్‌): రిపోర్టులు 
► విజయభాస్కర్‌రెడ్డి(పర్సనల్‌ ఆఫీసర్‌): పోస్టల్‌బ్యాలెట్‌ 

25న స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితా 
హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలో 118 మంది ఓటర్లున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, రాజ్యసభల సభ్యులు ఓటర్లు. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఈనెల 23వ తేదీ వరకు  స్వీకరించి తుదిజాబితా 25న వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోటాలోని ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌జాఫ్రి పదవీకాలం మే 1వ తేదీతో ముగియనున్నందున ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.  

మరిన్ని వార్తలు