నోముల భగత్‌కు కరోనా పాజిటివ్‌

19 Apr, 2021 18:07 IST|Sakshi

కరోనా వ్యాప్తి పెంచిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక

పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు కోవిడ్‌

సాక్షి, నల్లగొండ: నాగార్జున సాగర్‌లో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

వీరితో పాటు మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాక పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి.

చదవండి: లాక్‌డౌనా.. కర్ఫ్యూనా.. 48 గంటల్లోగా తేల్చండి: హైకోర్టు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు