శంషాబాద్‌: కోపంతో విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్‌! కారణం తెలిసి పోలీసులు షాక్‌

20 Feb, 2023 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ రావడంతో కాసేపు అధికారులు హడలి పోయారు. హైదరాబాద్‌-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. అయితే.. తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇక..

ఫోన్‌ చేసిన వ్యక్తిని వెంటనే ట్రేస్‌ చేశారు అధికారులు. ఆ వ్యక్తిని అజ్మీరా భద్రయ్యగా గుర్తించించింది సీఐఎస్‌ఎఫ్‌ ఇంటెలిజెన్స్‌. దీంతో భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను చెప్పిన కారణం విని అధికారులు బిత్తరపోయారు. 

విమానంలో భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ, ఆలస్యంగా రావడంతో విమానం ఎక్కేందుకు ఆయన్ని సిబ్బంది అనుమతించలేదు. దీంతో కోపంతోనే విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్‌ చేసి బెదిరించాడట భద్రయ్య.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు