నాటి ఆజ్‌కల్‌.. నేటి అజ్జకొల్లు.. 200ఏళ్ల క్రితం నామకరణం 

18 Jul, 2022 17:32 IST|Sakshi
అజ్జకొల్లు గ్రామ ముఖచిత్రం   

సాక్షి, మహబూబ్‌నగర్‌: కొన్ని ప్రాంతాలకు అక్కడి పరిస్థితులను భట్టి పేర్లు నామకరణం చేస్తారు. గతంలో నగరాలు, పల్లెలకు మంచి నాయకుల పెట్టారు. నేటికి అవే పేర్లతో గ్రామాలు పిలువడుతున్నాయి. అలాంటిదే నాటి ఆజ్‌కల్‌ నేటి అజ్జకొల్లుగా మారింది. ఈ గ్రామ నామకరణంపై ప్రత్యేక కథనం.. మదనాపురం మండలంలోని అజ్జకొల్లు మండలంలోనే ప్రస్తుతం పెద్ద గ్రామంగా పేరుంది. విభిన్న రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ప్రజలంతా నాటి నుంచి వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. 

200 ఏళ్ల క్రితం నామకరణం  
నిజాం నవాబు కాలంలో వనపర్తి సంస్థానంలో ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామంలో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు వంశీయుల ఆధీనంలో ఉన్నది. 1900 సంవత్సరం వరకు గ్రామాన్ని ఆజ్‌కల్‌గా పిలిచేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ పేరు కాస్త (అజ్‌కోల్‌)గా మారింది. నిజాం నవాబు భారత సైన్యాన్నికి లొంగిపోయిన అనంతరం కాలక్రమేణా అజ్జకొల్లుగా మారింది. ప్రస్తుతం గ్రామం చుట్టూ రాజవంశీయుల వారి భూములు ఉన్నాయి. గామంలో 80 శాతం మంది రైతులే. రామన్‌పాడు బ్యాకువాటర్‌తో పాటు ప్రధాన కాల్వల ద్వారా గ్రామానికి సాగునీరు అందుతుంది. ఏటా రెండు, పంటలు అధికంగా వరి పండుతుంది. 


పంచాయతీ కార్యాలయం

సర్పంచ్‌లుగా కొనసాగిన వారు.. 
బాలయ్య, చెన్నారెడ్డి, తిరుపతన్నగౌడ్, బాలగౌడ్, కుర్వ నారాయణ, రాజవర్దన్‌రెడ్డి, బాలమణెమ్మ, పద్మమ్మ, కుర్వ బుచ్చన్న, విజయేందర్‌రెడ్డి, ప్రస్తుత సర్పంచ్‌ బ్రహ్మమ్మ. 

ఒకరు ఎంపీపీ ఇద్దరు జెడ్పీటీసీలుగా.. 
ఉమ్మడి కొత్తకోట మండలానికి ఎంపీపీ బాలగౌడ్, జెడ్పీటీసీ బాల మణెమ్మ చేశారు. ప్రస్తుతం మదనాపురం జెడ్పిటీసీగా కృష్ణయ్య యాదవ్‌ అజ్జకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. 

‘ఆజ్‌కల్‌’గా  పిలిచేవారంటా.. 
మా గ్రామాన్ని నిజాం కాలంలో ఆజ్‌కల్‌గా పేరు నామకరణం చేశారని మా పెద్దలు చెప్పెవారు. అ పేరు కాల క్రమేణ అజ్జకొల్లుగా ప్రస్తుతం పిలుస్తున్నారు. ఈ విషయం ఇప్పటితరం పిల్లలకు తెలియదు. 
– కోట్లరాంరెడ్డి, అజ్జకొల్లు  

చరిత్ర పుటలు తెలియాలి  
అజ్జకొల్లు అనే పేరు ఎలా వచ్చిందో మా వయస్సున్న యువకులకు ఎవరికీ తెలియదు. మా తరం వాళ్లు ఈవిషయాన్ని ఎప్పుడు ఆలోచించలేదు. ప్రస్తుతం మా గ్రామానికి గా అప్పట్లో నామకరణం చేశారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.  
– మొగిలి, అజ్జకొల్లు

మరిన్ని వార్తలు