తలసానిని సత్కరించిన ఎన్నారై తెరాస నాయకులు 

11 Jun, 2022 21:15 IST|Sakshi

లండన్‌: వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్నారై తెరాస యూకే దాదాపు 12 సంవత్సరాలుగా లండన్ గడ్డపై చేస్తున్న కార్యక్రమాల గురించి మంత్రి తలసానికి ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి వివరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అటు తలసాని శ్రీనివాస్, తలసాని సాయి గెలుపు కోసం ఎన్నారై తెరాస క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన విషయాలని గుర్తు చేశారు.

దశాబ్ద కాలంగా యూకేలో అటు తెలంగాణ సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలే కాక  ముఖమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ఖండాంతరాల్లో బలపరుస్తూ తెరాస పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, మీ స్ఫూర్తి చాలా గొప్పదని అశోక్ మరియు రత్నాకర్ బృందాన్ని మంత్రి తలసాని అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నారై తెరాస యూకే చేస్తున్న సేవ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని , త్వరలో మళ్ళీ యూకేకి వస్తానని అప్పుడు ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో గొప్ప ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.

అదే పర్యటనలో ఉన్న తలసాని సాయి  కూడా ఎన్నారై తెరాస నాయకులు కలిశారు. ఈ సమావేశంలో అశోక్ గౌడ్ దుసారి, రత్నాకర్ కడుదుల, హరిగౌడ్ నవాపేట్, మల్లారెడ్డి బీరం, సతీష్ బండ, మట్టారెడ్డి, నవీన్ భువనగిరి, అబు జాఫ్, సేరు సంజయ్, మదు, గణేష్ కుప్పలా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు