25 నుంచి నుమాయిష్‌ పునఃప్రారంభం

15 Feb, 2022 03:26 IST|Sakshi

అబిడ్స్‌: ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఎగ్జిబిషన్‌ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌ను కరోనా కారణాలతో 2 నుంచి నిలిపివేయడం తెలిసిందే.

కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇచ్చింది. దాదాపు 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్లతో పాటు పలు రాష్ట్రాల స్టాళ్లను కూడా ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.   

మరిన్ని వార్తలు