8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ

2 Nov, 2021 21:05 IST|Sakshi

10 మండలాల్లోని 125 ఆవాసాల్లో ఈ భూమి

మొత్తం 8,208 మంది ఆధీనంలో ఉన్నట్లు గుర్తింపు

ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణకు గ్రామసభలు

ఈ సభల తీర్మానంతోనే తేలనున్న అర్హుల సంఖ్య

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అటవీ భూమిలో పోడు ఆక్రమణ ఎంతో తేలింది. 10 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలకు చెందిన 125 గ్రామాలు, ఆవాసాల్లో ఈ ఆక్రమణ భూమి ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తంగా 8,208 మంది ఆధీనంలో 17,449 ఎకరాలు ఉందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఈనెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ  చేపట్టనున్నారు. ఈలోగా ప్రభుత్వం నుంచి వచ్చే గైడ్‌లైన్స్‌తో అధికార యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణపై ముందుకెళ్లనుంది. 

అటవీ భూమి 1.57 లక్షల ఎకరాలు..
జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల ఎకరాల్లో భూమి ఉంది. ఇందులో అటవీ విస్తీర్ణం 1,57,888 ఎకరాలు  (14.66 శాతం). మొత్తం అటవీ భూమిలో ప్రస్తుతం ఇందులో 17,449 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అత్యధికంగా కారేపల్లి (సింగరేణి) మండలంలో 1,510 మంది ఆధీనంలో 4,673.315 ఎకరాలు, ఆ తర్వాత సత్తుపల్లి మండలంలో 2,355మంది చేతిలో 3,208.27 ఎకరాల భూమి ఉంది. 2005 నుంచి ఇప్పటి వరకు 17,861 ఎకరాలకు సంబంధించి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. 

ఎఫ్‌ఆర్‌సీ కమిటీ పర్యవేక్షణలో..
ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో మొదటిగా గ్రామసభ నిర్వహిస్తారు. ఈ కమిటీకి పోడుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సంబంధిత అధికార బృందం విచారణ, సర్వే పూర్తి చేస్తుంది. అనంతరం అర్హులు ఎవరన్నది గ్రామసభ తీర్మానం చేసి దరఖాస్తులను సబ్‌ డివిజన్‌ లెవెల్‌ కమిటీకి పంపుతుంది. అక్కడి నుంచి ఈ నివేదిక జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి చేరుతుంది. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత హక్కుపత్రాలను పోడుదారులకు జారీ చేస్తుంది. 

ఈనెల 8 నుంచి అటవీ భూమి ఆక్రమణకు గురైన 95 గ్రామ పంచాయతీల వారీగా 95 బృందాలు దరఖాస్తులు స్వీకరించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ 2005  చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులను గుర్తించి హక్కపత్రాలు ఇస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియను అంతా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ భూమి సంరక్షణకు హద్దులు నిర్ణయిస్తారు. ఈ భూమి సంరక్షణ కోనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజిలెన్స్‌ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. 

ఎస్టీల ఆధీనంలో 56 శాతం..
జిల్లాలోని 10 మండలాల్లో పోడు భూమి ఉంటే..ఎస్సీ,ఎస్టీ, గొత్తికోయ, ఇతర కేటగిరిలకు చెందిన మొత్తం 8,208 మంది 17,449 ఎకరాలను ఆక్రమించారు. ఇందులో ఎస్టీల చేతిలో అత్యధికంగా 9764 ఎకరాలు ఉండగా.. ఎస్సీలకు 1,602 ఎకరాలు, గొత్తికోయలు ఆధీనంలో 116 ఎకరాలు ఉంది. ఇతర కేటగిరిలకు చెందిన వారు మిగితా అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు 56 శాతం ఎస్టీల ఆధీనంలోనే ఈ ఆక్రమణకు గురైన భూమి ఉంది. మిగితా 44 శాతం ఎస్సీలు, గొత్తికోయలు, ఇతర కేటగిరిల చేతిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. 

గైడ్‌లైన్స్‌ ప్రకారం చర్యలు..
ప్రభుత్వం పోడు భూములపై దరఖాస్తుల స్వీకరణ, అఖిలపక్ష పార్టీలతో సమావేశంపై జిల్లా యంత్రాంగాలకు గతంలో సూచనలు చేసింది. ఈ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలతో సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. అయితే ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్‌ ప్రకారమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. పోడుదారులను ఎలా గుర్తించాలన్న దానిపై అఖిలపక్ష పార్టీల నేతలు, ఆదివాసీ సంఘాలు కూడా జిల్లా యంత్రాంగానికి, నేరుగా ప్రభుత్వ పెద్దలకు పలు దఫాలుగా వినతులు అందించారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఎఫ్‌ఆర్‌సీ కమిటీలు గ్రామసభ అర్హుల జాబితాను ఫైనల్‌ చేసి సబ్‌ డివిజన్‌ స్థాయి, జిల్లా స్థాయి కమిటీకి పంపనుంది. 

మండలాల వారీగా ఆక్రమణకు గురైన భూమి (ఎకరాల్లో..), పోడు దారుల సంఖ్య ఇలా ఉంది

మండలం      పోడుదారులు  భూమి
సత్తుపల్లి            2,355 3,208.27
కొణిజర్ల              1,575   3,682
సింగరేణి            1,510   4,673.315
పెనుబల్లి             1,182 1,580.8
రఘునాథపాలెం               735 1,795.525
కామేపల్లి               314        988.2275
ఏన్కూరు                 282   1,087.975
తల్లాడ                  104      270.8
చింతకాని                88    130
వేంసూరు                 63       31.75
మొత్తం            8,208     17,448.66


––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
     పోడుదారులు            భూమి
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
సత్తుపల్లి                        3,208.27
కొణిజర్ల              
సింగరేణి                    4,673.315
పెనుబల్లి                        1,580.8
రఘునాథపాలెం                    1,795.525
కామేపల్లి                   988.2275
ఏన్కూరు                    1,087.975
తల్లాడ                      270.8
చింతకాని                        130
వేంసూరు                        31.75
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం                       
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
పొటోరైటప్‌
02సీకేఎం01: కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అటవీ భూమి గూగుల్‌మ్యాప్‌


 

మరిన్ని వార్తలు