ఉచిత నీటికి ‘ఆక్యుపెన్సీ’ గండం

5 Jul, 2021 10:33 IST|Sakshi

200 చ.అ.లోపు ఇళ్లున్నవారికి అవస్థలు

ఆక్యుపెన్సీ జారీ చేయని బల్దియా

అది తప్పనిసరి అంటున్న జలమండలి

రూ.వేలల్లో నీటి బిల్లులు జారీ

బెంబేలెత్తుతున్న వినియోగదారులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకానికి ఆక్యుపెన్సీ ధ్రువీకరణ గండంలా పరిణమింంది. మహానగర శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో వేలాది నివాసాలు 200 చదరపు అడుగుల్లోపే ఉన్నాయి. వీటిలో చాలా భవనాలు 2012 ఏప్రిల్‌ 7 తర్వాత నిర్మింనవే. కానీ ఈ భవనాలకు విధిగా జీహెచ్‌ఎంసీ నుంచి జారీచేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ సమర్పిస్తేనే నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం వర్తిస్తుందని మున్సిపల్‌ పరిపాలన శాఖ తాజాగా వర్గదర్శకాలు జారీచేసింది.

కానీ ఆక్యుపెన్సీ జారీచేసే విషయంలో బల్దియా చుక్కలు చూపుతోంది. చాలా మంది వినిÄñæగదారులు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ కోసం బల్దియా క్షేత్రస్థాయి కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు ధ్రువీకరణ జారీకి ససేమిరా అంటుండడం గమనార్హం. ఇదే సమయమయంలో వినియోగదారులకు డిసెంబరు–2020 నుంచి జూన్‌–2021 మధ్యకాలానికి జలమండలి నీటి బిల్లులు జారీచేసింది. ఈ బిల్లులు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సుమారు ర.5వేల నుంచి ర.10 వేల మధ్యన ఉన్నాయి. దీంతో వినియోగదారుల గుండె గుభిల్లుమంటోంది.  

నిబంధనలు సడలించాల్సిందే.. 
గ్రేటర్‌ పరిధిలో సుమారు 10.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ నల్లాలు (డొమెస్టిక్‌) ఉన్నా యి. మరో రెండు లక్షల వరకు మురికివాడల (స్లమ్స్‌)కు సంబంధించిన నల్లాలున్నాయి. ఇప్పటికే స్లమ్స్‌ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతోంది. ఇదే తరహాలో డొమెస్టిక్‌ నల్లాలకు సైతం ఆక్యుపెన్సీ ధ్రువీకరణతో సంబంధం లేకుండా కేవలం నల్లా కనెక్షన్‌ నెంబరుకు ఆధార్‌ అనుసంధానం చేసుకోవడం, నల్లాకు నీటిమీటరును ఏర్పాటు చేసుకున్న వెంటనే ఉచిత నీటి పథకానికి అర్హులను చేయాలని వేలాదిమంది శివారు వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం..  
ఉచిత తాగునీటి పథకం అమలుకు మున్సిపల్‌ పరిపాలన శాఖ జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నాం. 2012 ఏప్రిల్‌కు ముందు నిర్మింన భవనాలకు సంబంధిత మున్సిపాలిటీ జారీ చేసిన ఇంటి నిర్మాణ అనుమతులు, నిర్మాణ ప్లాన్‌ను జలమండలికి సమర్పించాల్సి ఉంటుంది. 2012 ఏప్రిల్‌ 7 తర్వాత నిర్మింన భవనాలకు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి అని మున్సిపల్‌ పరిపాలనశాఖ స్పష్టంచేసింది. ప్రతి నల్లాకూ నీటి మీటరును ఏర్పాటు చేసుకోవడం, నల్లా కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ నంబరును అనుసంధానం చేసుకున్న అనంతరమే ఈ పథకానికి అర్హత పొందుతారు.   
– ప్రవీణ్‌కుమార్, జలమండలి రెవెన్యూ విభాగం డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు