ఆధునిక యుద్ధ ట్యాంకులను పరీక్షించిన ఓడీఎఫ్‌

19 Dec, 2021 04:01 IST|Sakshi

కొండాపూర్‌(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ చెరువులో శనివారం రెండు యుద్ధ ట్యాంకుల ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్‌ పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ట్యాం కులను చెన్నై, మెదక్‌లోని ఓడీఎఫ్‌లో మాత్రమే తయారు చేస్తారన్నారు. ఒక్కో ట్యాంక్‌లో పది మంది కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు.

ఈ యుద్ధ ట్యాంక్‌కు కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని, నీటితో పాటు బురద, నేలపై దూసుకుపోతుందని పేర్కొన్నారు. శత్రువులపై దాడి చేసే సమయంలో పెద్దపెద్ద సరస్సులను దాటేందుకు అనువుగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్‌ బ్రిగేడియర్‌ నేవిబుట్ట, జాయింట్‌ కంట్రోలర్‌ శరవణన్, డిప్యూటీ కంట్రోలర్‌ బాలషణ్ముగం తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు