బతికుండగానే చంపేశారు..

4 Sep, 2021 14:02 IST|Sakshi

బెల్లంపల్లి(మంచిర్యాల): అధికారుల తప్పిదంతో మండల కేంద్రానికి చెందిన గజెల్లి భూదేవి అనే పండు వృద్ధురాలు పదినెలలుగా ఆసరా పింఛన్‌ దూరమైంది. ఏళ్లుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తూ పింఛన్‌పై ఆధారపడిన ఆమెకు ఆకస్మాత్తుగా పింఛన్‌ నిలిపివేశారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే.. రికార్డుల్లో నువ్వు చనిపోయావని ఉందని, అందుకే తొలగించామని అధికారులు పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక పది నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ ఆసరా కోసం అధికారుల కాళ్లావేళ్లా పడుతోంది.

రెండుసార్లు కలెక్టర్‌ను కలిసినా ఫ లితం లేదని వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. దా దాపు 25 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా.. కుమార్తెలకు వివాహం చేసి పంపించింది. కుమారులు లేకపోవడంతో రూ.200 పింఛన్‌ ఉన్నప్పటి నుంచి వాటిపైనే ఆధారపడి ఒంటరిగా ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్‌ పునరుద్ధరించడంతోపాటు పదినెలల నగదు ఇప్పించాలని వేడుకుంటుంది.

దొంగిలించిన బైక్‌పైనే దర్జాగా చక్కర్లు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో బైక్‌ను దొంగలించి దానిపైనే చక్కర్లు కొడుతున్న దొంగల ఫొటోను మంచిర్యాల పోలీసులు సోషల్‌మీడియాలో పోస్టుచేయగా శుక్రవారం వైరల్‌గా మారాయి. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రామకృష్ణాపూర్‌కు చెందిన పులి సంతోష్‌ బైక్‌ను ఆగస్టు 31న జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వర టాకీస్‌ వద్ద దొంగిలించారు. బైక్‌ యజమాని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బైక్‌ దొంగిలించిన వ్యక్తులను పట్టుకునేందుకు వారి ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. నిందితులను గుర్తు పట్టిన వారు 9440795042, 9440908844 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.  

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. అయినా స్మోక్‌ చేయకూడదు!

మరిన్ని వార్తలు