భారత్‌కు ముప్పేమీ లేదు: ఒమర్‌ అబ్దుల్లా

17 Aug, 2021 09:59 IST|Sakshi

అఫ్గాన్‌లో పరిణామాలపై ఒమర్‌

‘గీతం’ విద్యార్థులతో ముచ్చట  

పటాన్‌చెరు: అఫ్గానిస్తాన్‌లో తాజా పరిణామాల వల్ల దేశానికి ఎలాంటి ముప్పూ లేదని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు సాధించడం వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని గీతం యూనివర్సిటీ ప్రముఖ రాజకీయవేత్తలతో చేపట్టిన చర్చా వేదికలో సోమవారం ఆయన ‘పాలసీ మేకింగ్‌ ఇన్‌ నేషన్‌ బిల్డింగ్‌’అంశంపై మాట్లాడారు. ‘గీతం’లో కొత్తగా ప్రారంభించిన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ కోర్సులో చేరిన 48 మంది విద్యార్థులతో ముచ్చటించారు.

మీరే ప్రధాని అయితే అఫ్గానిస్తాన్‌లో తాజా పరిణామా లపై ఎలా స్పందిస్తారని ఓ విద్యార్థి అడగ్గా ‘మానవతా దృక్పథంతో ఎక్కువ మంది అఫ్గాన్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పించే వాడిని’అని బదులిచ్చారు. తనకు ప్రధాని అయ్యే అలోచనలేవి లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ ఉచ్చులో ప్రతిపక్షాలు: కేంద్రంలోని అధికార పార్టీ ఉచ్చులో ప్రతిపక్షాలు ఇరుక్కుపోతున్నాయని, ఫలితంగా లోపభూయిష్టమైన చట్టాలు అమల్లోకి వస్తున్నాయని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. అంతకుముందు జరిగిన మరో చర్చలో ఒవైసీ మాట్లాడారు.

మరిన్ని వార్తలు