టీకా కోసం 1.94 కోట్ల మంది ఎదురుచూపులు

24 Jun, 2021 05:01 IST|Sakshi

కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో టీకాల కోసం పరుగులు

వారందరికీ వేయాలంటే నాలుగు నెలలు పడుతుందని అంచనా

వరంగల్‌ రూరల్, ఖమ్మం జిల్లాల్లో పాజిటివిటీ అధికం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో.. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు  కలవరపెడుతున్నాయి. దీం తో అందరూ టీకాల కోసం పరుగులు తీ స్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసా గుతోంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు 93.25 లక్షల డోస్‌లు వేశారు. రాష్ట్రంలో ఇంకా 1,94,85,855 మందికి టీకా వే యాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలి పింది. అందులో 18-44 ఏళ్ల వయసున్న 1,53,90,824 మందికి, 45 ఏళ్లు పైబడిన 40,95,031 మందికి టీకా వేయాల్సి ఉంది. ప్రస్తుతం లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రోజూ టీకా వేస్తున్నారు. అయితే,  ఎదురుచూస్తున్న 1.94 కోట్ల మందికి టీకా వేయాలంటే దాదాపు 4 నెలల సమయం పడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. రెండు డోస్‌లు పూర్తి చేయాలంటే 6 నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా.

ఆసుపత్రుల బాధితులకు పరిహారం..
అత్యధికంగా బిల్లులు వసూలు చేస్తున్నా రంటూ రాష్ట్రంలో 170 ప్రైవేట్‌ కార్పొరేట్‌ తదితర ఆసుపత్రులపై కరోనా బాధితు ల నుంచి వైద్య, ఆరోగ్య శాఖకు 350 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటివరకు 30 ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు రూ.72,20,277 ఇప్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ నెల 1 నుంచి 21 వరకు రాష్ట్రంలో 24,69,017 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో ర్యా పిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు 22,45,418 చే యగా, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు 2,23,599 మాత్రమే చేశారు. ఇదే కాలంలో రాష్ట్రం లో కరోనా పాజిటివిటీ రేటు 1.46 శాతం గా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2.38శాతం, ఖమ్మం జిల్లాలో 2.07 శా తం, రంగారెడ్డి జిల్లాలో 2 శాతం పాజిటి విటీ నమోదైంది. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖ వైరాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్‌టీ తదిత ర విభాగాలకు చెందిన 12 మంది నిపు ణులతో అడ్వైజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 21 వరకు మొదటి, రెండు డోస్‌లు కలిపి 93,25,254 వ్యాక్సిన్లు వేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు