మినీ ఆక్సిజన్‌ సిలిండర్‌ లీక్‌ 

1 Sep, 2020 04:51 IST|Sakshi

భయంతో పరుగులు తీసిన రోగులు

ఊపిరాడక ఒకరి మృతి  

గద్వాల అర్బన్‌: జిల్లా ఆస్పత్రిలో మినీ ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకైంది. దీంతో రోగులు భయంతో బయటకు పరుగులు తీస్తుండగా.. ఒకరు మృత్యువాత పడ్డారు. సోమవారం ఉదయం జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఎన్‌బీహెచ్‌యూ వార్డులో అప్పుడే పుట్టిన శిశువుకు ఆక్సిజన్‌ పెట్టేందుకు ఓ నర్సు యత్నించగా.. మినీ సిలిండర్‌ స్ట్రక్‌ కావడంతో ఫ్లోమీటర్‌ కింద పడి పగిలింది. ఆ సమయంలో శబ్దంతో పాటు గ్యాస్‌ లీకైంది. దీంతో ఎన్‌బీహెచ్‌యూ, ఐసీయూ, జనరల్‌ వార్డుల్లోని రోగులు, వారి బంధువులు భయంతో పరుగులు తీశారు.  ఆ సమయంలో శబ్దం పెద్దగా రావ డంతో రోగులు ఆందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు.

భయంతో రోగి మృతి 
కాగా, గద్వాల మండలం శెట్టిఆత్మకూర్‌కు చెందిన లక్ష్మన్న (46) డయాలసిస్‌ పేషెంట్‌. బ్లడ్‌ షుగర్‌ లెవల్‌ తగ్గిందని సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అతడికి వైద్యసిబ్బంది క్యాజువాలిటీ వార్డులో ఉంచి చికిత్స నిర్వహించారు. అయితే గ్యాస్‌ లీకేజీ అయిందని తెలుసుకున్న అతను భయంతో బయటకు పరుగులు తీస్తూ ఊపిరి ఆడక మృతి చెందాడు.   

మరిన్ని వార్తలు