పోలీసు అభ్యర్థులకు కీలక సూచనలు.. పరీక్షకు అవి మాత్రమే అనుమతి

6 Aug, 2022 13:06 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించే ఎస్‌ఐ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరుగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచి్చనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. పరీక్ష కోసం నగరంలో 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి పైగా హాజరవుతుండగా..వీరిలో దాదాపు 50 వేల మంది నగరంలోనే రాయనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను జేఎనీ్టయూలోని స్ట్రాంగ్‌ రూమ్‌ సిబ్బందికి అప్పగించడం..వంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్‌ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ చేస్తున్న కీలక సూచనలివి..

ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరుగుతుంది.  
ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు.  
సెల్‌ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్‌ వాచీలు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎల్రక్టానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.  
అభ్యర్థులు తమ వెంట హాల్‌టిక్కెట్, పెన్‌ మాత్రమే తెచ్చుకోవాలి.  
అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్‌ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహిందీ, టాటూలకు దూరంగా ఉండాలి
చదవండి: ‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్‌ చాట్లు వెలుగులోకి

మరిన్ని వార్తలు