గ్రామానికి ఒకే వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలి

11 Aug, 2020 12:19 IST|Sakshi

చౌటుప్పల్‌ : కరోనా తీవ్రరూపం దాలుస్తు న్న నేపథ్యంలో ప్రజలు వినాయకచవితి వేడుకల్లో తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. చౌటుప్పల్‌ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గ్రామానికి ఒకే వినాయకుణ్ణి, మూడు అడుగుల ఎత్తుకు మించకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. జనం గుమికూడకుండా ఉండాలన్నారు. ఉత్సవ నిర్వాహకులు బలవంతంగా చందాలు వసూలు చేయొద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకన్న ఉన్నారు.    

మరిన్ని వార్తలు