ఐఎస్‌ఐ ఆన్‌లైన్‌ 'గేమ్‌' ప్లాన్‌

19 Aug, 2020 02:17 IST|Sakshi

కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ దందాలో కొత్త కోణం

బీజింగ్‌ టీ పవర్‌ కంపెనీ తరపున పాక్‌ వెళ్లొచ్చిన యాన్‌ హూ

యువతే లక్ష్యంగా ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర

లోతుగా ఆరా తీస్తున్న కేంద్ర నిఘా వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లోని మధ్య తరగతి యువతే టార్గె ట్‌గా, కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ పేరుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు తెరలేపిన చైనాకు చెందిన బీజింగ్‌ టీ పవర్‌ సంస్థకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలి జెన్స్‌ (ఐఎస్‌ఐ) మద్దతు ఉందా? ఔననే అంటు న్నాయి కేంద్ర నిఘా వర్గాలు. హైదరాబాద్‌ సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టుచేసిన చైనా జాతీ యుడు, బీజింగ్‌ టీ పవర్‌ కంపెనీ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌ యాన్‌ హూ పాస్‌పోర్టును అధ్యయనం చేసిన కేంద్ర నిఘా వర్గాలు ఈ అను మానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఐఎస్‌ఐ లింక్‌
బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ.. ‘ఈ–కామర్స్‌’ ముసుగులో నమోదు చేయించిన 8 కంపెనీల్ని ఢిల్లీలో ఉంటూ యాన్‌ హూ పర్యవేక్షిస్తున్నాడు. దీనికి ముందే గతేడాది నవంబర్‌లో ఇతగాడు పాకిస్తాన్‌ వెళ్లినట్లు అతడి పాస్‌పోర్టు వివరాల్ని విశ్లేషించిన ఐబీ వర్గాలు చెబుతున్నాయి. 15 రోజులు అక్కడే ఉన్న హూ ఐఎస్‌ఐ బాధ్యుల్ని కలిసినట్లు అనుమానిస్తు న్నాయి. భారత్‌ కేంద్రంగా సాగించే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందా నిర్వహణపై వారు చర్చించి ఉంటారని, ఐఎస్‌ఐ సంపూర్ణ మద్దతు తోనే గేమ్‌ మొదలై ఉం టుందని అంచనా వేస్తు న్నాయి. ఈ కోణంలో మరిన్ని ఆధారాల సేకర ణపై దృష్టి పెట్టాయి. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీ సులు లేదా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధి కారులు యాన్‌ హూను కస్టడీలోకి తీసుకున్నప్పుడు విచారించాలని నిర్ణయించారు.

కొరియాలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి?
కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌లో భాగంగా.. 3 నిమిషాలుండే ఒక్కో బెట్టింగ్‌లోనూ ఆఖరి 30 సెకండ్లు ఫలితాలను నిర్ధారిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఏ రంగుపై ఎక్కువ మంది/ ఎక్కువ మొత్తం బెట్టింగ్‌ కాస్తున్నారో వారు ఓడిపోయేలా ఈ ప్రోగ్రా మింగ్‌ను డిజైన్‌ చేశారు. ఈ మొత్తం సాఫ్ట్‌వేర్‌ను యాన్‌ హూ కొరియాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వద్ద అభివృద్ధి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇతడు భారత్‌కు వచ్చే ముందు కొరియాకు వెళ్లివచ్చినట్లు ఇమ్మిగ్రేషన్‌ నుంచి సమాచారం అందుకున్న ఐబీ ఈ అంచనాకు వచ్చింది. యాన్‌ హూ ఇంకా ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, యూఏఈ, జపాన్‌ కూడా వెళ్లొచ్చాడని ఐబీ వర్గాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా వచ్చిన సొమ్మును హాంకాంగ్‌ నుంచి ఆయా దేశాలకూ మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర?
ఢిల్లీకి చెందిన హేమంత్‌ సాయంతో తమ కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్లను పెట్టి దందా నడిపిన యాన్‌ హూ, తన పేరు బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాల నిర్వహణకు ఆథరైజేషన్‌ తీసుకోవడం ద్వారా ఆయా కంపెనీలతో సంబంధాలున్నట్లు పరోక్ష ఆధారాలు అందించాడు. ఇప్పుడిదే దర్యాప్తులో కీలకం కానుంది. కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌లో రూ.1.5 లక్షలు పోగొట్టుకున్న ఎస్సార్‌నగర్‌కు చెందిన యువకుడి ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ తాజా కేసులో పీటీ వారెంట్‌పై నిందితుల్ని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘బీజింగ్‌ టీ పవర్‌ కంపెనీకి ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. ఇందులో మోసంతో పాటు ఇతర కోణాలున్నాయా అనేది పరిశీలిస్తున్నాం. భారత్‌పై పాక్‌ చేస్తున్న కుట్రలకు చైనా మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్థికంగా దెబ్బతీసే ఈ దందాకు ఐఎస్‌ఐ మద్దతునిచ్చిందనే భావిస్తున్నాం. ప్రాథమిక సమాచారాన్ని రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖలకు చేరవేశాం’ అని వివరించారు.  

మరిన్ని వార్తలు