‘కేసీఆర్ నేపథ్యంలోనే రాజన్న ఆలయ నిధుల మళ్లింపు’

22 Sep, 2023 11:54 IST|Sakshi

వేములవాడ రాజన్న ఆలయ నిధుల మళ్లింపు' పై హిందూ సంఘాల ఆగ్రహం!

నిధుల మళ్లింపు జీవో రద్దు..

వేములవాడ బంద్ కు జేఏసీ పిలుపు!

సాక్షి, రాజన్న సిరిసిల్ల: 'వేములవాడ రాజన్న ఆలయ నిధుల మళ్లింపు' పై హిందూ సంఘాల ఆందోళన చెలరేగింది. ఆలయ నిధులు 5 కోట్ల రూపాయలు, కామారెడ్డి జిల్లాలోని ఆలయాలకు కేటాయించారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని ఆలయాల అభివృద్ధి కోసం వేములవాడ ఆలయ నిధుల మళ్లింపుకు సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ.. గుట్టు చప్పుడు కాకుండా నిధులు మళ్లిస్తున్నారంటూ బీజేపీ మండిపడింది.

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలో ఉంటున్న నేపథ్యంలోనే ఈ నిధుల మళ్లింపు జరుగుతుందని, దీనికి సమాధానం కావాలని ప్రతిపక్షాలు ఆరోపణ వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ ఫోటో దగ్ధం చేశారు. ఎల్లుండి వేములవాడ బంద్ కు జేఏసీ పిలుపునిస్తూ, దీనిపై వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛంద మద్దతు తెలపాలని కోరింది.  అలగే బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు జరగనుంది.

మరిన్ని వార్తలు