ఓయూలో ఔటర్స్ ఖాళీ చేయాల్సిందే

18 Dec, 2020 21:00 IST|Sakshi

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అన్ని హాస్టళ్లను మూసివేసిన సంగతి మనకు తెలిసిందే. విద్యార్థులకు నష్టం కలుగకుండా ఆన్‌లైన్‌ లో తరగతులు నిర్వహించింది. అయితే, ఇటీవల కొంత కాలం నుంచి అక్కడ అనధికారికంగా ఉంటున్న వారి కారణంగా యూనివర్సిటీలో శాంతిభద్రతల సమస్య ఉన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్‌ ఆఫీసర్ పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో వర్సిటీలోని హాస్టళ్లు మూసివేసినా కూడా కొందరు విద్యార్థుల ముసుగులో హాస్టల్లో ఉంటున్నారు అని పేర్కొన్నారు. హాస్టల్స్‌లో అక్రమంగా బస చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరైతే అనధికారికంగా హాస్టళ్లలో ఉంటున్నారో వారంతా తమకు సమాచారం ఇచ్చి, ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని పబ్లిక్ రిలేషన్స్‌ ఆఫీసర్ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు