రిమ్స్‌ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల దందా

3 Aug, 2021 14:59 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్ అస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యొగాల అమ్మకాల దందా బయటపడింది. స్డాప్ నర్సు ఉద్యోగానికి రూ. లక్ష 50 వేలు చెల్లించాలని మద్యవర్తులు నిరుద్యోగులతో బేరసాలకు దిగారు. స్టాప్ నర్సు ఉద్యోగానికి  ఎంపికైన సుప్రియను డబ్బులు చెల్లించాలని బ్రోకర్‌ డిమాండ్‌ చేశాడు. మద్యవర్తి రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు. ఇలా ఐదుగురు నిరుద్యోగులతో మద్యవర్తులు బెరసారాలకు దిగుతున్నారు. ఈ క్రమం‍లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల వేలంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై బాదిత కుటుంబ సభ్యులు రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ బాధితులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు