ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పాదయాత్ర: బండి సంజయ్‌

5 Jul, 2021 14:21 IST|Sakshi

అహంకార, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి 

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ మండిపాటు 

ప్రజాస్వామిక తెలంగాణ’లక్ష్యంగా పాదయాత్ర: బండి సంజయ్‌

ఎన్ని చేసినా హుజూరాబాద్‌లో బీజేపీదే గెలుపు: ఈటల  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అహంకార, నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ ధ్వజమెత్తారు. అప్రజాస్వామిక, అవినీతిమయ పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని, తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవరోధాల్లేకుండా దోచుకోవడం, దాచుకోవడం సాగుతోందని మండిపడ్డారు. గతవారం వరకు టీఆర్‌ఎస్‌ కార్యాల యం నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి దిశానిర్దేశం జరి గేదని, తాజాగా కాంగ్రెస్‌ బీ టీమ్‌గా టీడీపీ మారిపోయిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ నాయకులను చంద్రబాబు నడిపిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల సక్రమ వినియోగంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్ర ఇరురాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకుంటే కేంద్రం సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వా మ్యనికి, నియంతృత్వానికి జరుగుతున్న పోరా టంలో బీజేపీకి అండగా నిలవాలని కోరారు. 
హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే 
సీఎం కేసీఆర్‌ ఎన్ని ఎత్తులు వేసినా హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి భయపెడుతున్నారని దుయ్యబట్టా రు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న తప్పిదాలను గుర్తించామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని, గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
 

ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఎన్నికను సీఎం కేసీఆర్‌ జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారని పేర్కొన్నా రు. హుజురాబాద్‌ గడ్డమీద ఎగరేది కాషాయ జెం డానే అన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఆయన అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు