తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్‌ అరెస్టు

8 Oct, 2021 11:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ రంగంలోకి దిగింది. సీసీఎస్‌ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5కోట్లును ముఠా కొల్లగొట్టిన విషయం తెలసిందే. ఆ దోచుకున్న సొమ్మును ఎక్కడ దాచారనే కోణంలో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేయనుంది.

తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను కలర్ జిరాక్స్ తీసి ఫోర్జరీ చేసిన పద్మనాభన్‌ను కోయంబత్తూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణారెడ్డి, భూపతి, యోహన్, రమణారెడ్డి పలువురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. ఫోర్జరీరీ డాక్యుమెంట్లు, ఫేక్ అకౌంట్స్, ఐడీలు నిందితులు సృష్టించారు. మరోవైపు నేడు మూడవ రోజు కస్టడికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ హాజరుకానున్నారు. అయితే అరెస్ట్ అయిన ఇతర నిందితులను సైతం పోలీసులు కస్టడికి కోరారు.
చదవండి: బతుకమ్మల పైనుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్‌

మరిన్ని వార్తలు