పాకిస్తాన్‌లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల

1 Jun, 2021 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదలయ్యాడు. అతను సోమవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. 2017 ఏప్రిల్‌లో హైదరాబాద్‌ నుంచి ప్రశాంత్‌ అదృశ్యమయ్యాడు. తన ప్రియురాలి కోసం పాకిస్తాన్‌ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో ప్రశాంత్‌ పాక్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంత కాలం ప్రశాంత్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. తాజాగా వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ఆ యువకుడిని భారత్‌కు అప్పగించారు. ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేశాడు.

2019లో తన కొడుకును రప్పించే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ తండ్రి బాబూరావు  సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్‌ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నుంచి ప్రశాంత్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అతని సోదరుడు శ్రీకాంత్‌ తెలిపాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు నాలుగేళ్లుగా పోలీసుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపాడు.
చదవండిఎంత చెప్పిన వినరే.. ఏం.. తమాషా చేస్తున్నారా..?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు