Agnipath Scheme Protests: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!

20 Jun, 2022 12:18 IST|Sakshi

హైదరాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన  అగ్నిపథ్‌ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్‌గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్‌లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

కాగా, అగ్నిప‌థ్ పథకాన్ని వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 

మరిన్ని వార్తలు