పాములు పడితే రూ.22 వేలు!

21 Jul, 2022 02:41 IST|Sakshi

వర్షాలతో పాముల బెడద 

సాక్షి, మంచిర్యాల: వరదలతో పాముల బెడద ఏర్పడటంతో వాటిని పట్టేవారికి గిరాకీ ఏర్పడింది. మంచిర్యాల పట్టణం గోదావరి తీరంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలోకి కుప్పలు తెప్పలుగా సర్పాలు కొట్టుకొచ్చాయి. వారం రోజులుగా బురదను శుభ్రం చేస్తున్నప్పుడు ఇవి బయటపడుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని బురదను తొలగిస్తుండగా ఓ మహిళను పాము కాటు వేసింది.

దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు పాములు పట్టేవారిని రప్పించారు. మూడు రోజుల పాటు పాములు పట్టేందుకు పెద్దపల్లి జిల్లా కల్వచర్లకు చెందిన శ్రీనివాస్, బెల్లంపల్లికి చెందిన సంజీవ్‌లకు రూ.22 వేలు చెల్లిస్తున్నారు. వీరిద్దరూ బుధవారం సాయంత్రం నాలుగు పాములు పట్టారు. మరో రెండు రోజులు వీరి పని కొనసాగనుంది. ముంపు బాధితులకు కూడా సర్పాల బెడద ఏర్పడటంతో వారు పాములు పట్టేవారిని పిలిపించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు