వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం తంటాలు..

8 May, 2021 16:04 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుతం వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే కోవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.  అయితే ఫిలింనగర్‌ ఆస్పత్రి నిర్వాకం వల్ల శుక్రవారం వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. షేక్‌పేట అంబేద్కర్‌ నాలా సమీపంలో ఉండే ఫిలింనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతి లేకపోవడంతో గౌతంనగర్‌ కమ్యూనిటీ హాల్లో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. శుక్రవారం కోవిన్‌ యాప్‌ ఓపెన్‌ చేసిన చాలా మందికి ఫిలింనగర్‌లో రెండు చోట్ల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నట్లు కనిపించింది.

ఒకటి ఫిలింనగర్‌ యూపీహెచ్‌సీ మరోటి యూపీహెచ్‌సీ –2 డీ అని కనిపించాయి. దీంతో చాలా మంది ఫిలింనగర్‌ యూపీహెచ్‌సీ –2 డీలో కూడా స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. తీరా గౌతంనగర్‌ కమ్యూనిటీ హాల్‌ దగ్గర వైద్య సిబ్బంది కూడా లేకపోవడంతో మళ్లీ షేక్‌పేట సమీపంలోని ఫిలింనగర్‌ ఆరోగ్య కేంద్రానికి పరుగులు తీశారు. ఫిలింనగర్‌ యూపీహెచ్‌సీ –2డీలో స్లాట్‌ బుక్‌ చేసుకోవడంతో అక్కడ వ్యాక్సిన్‌ వేయలేదు. సాంకేతిక సమస్య కారణంగా గందరగోళ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు