కర్య్ఫూను కేర్‌ చేయని ఆకతాయిలు, రోడ్డుపై హల్‌చల్‌

26 Apr, 2021 11:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సైదాబాద్‌: కరోనాలోను కొంత మంది యువత తమ ఆకాతాయి బుద్ధి మార్చుకోవడం లేదు.  రాత్రయితే చాలు ఆ రహదారిపై వెళ్లాలంటే భయాందోళన తప్పదు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి బైక్‌లపై స్టంట్స్‌ చేస్తారో తెలియదు. ఒక్కసారిగా పెద్దఎత్తున బైకులు రోడ్లపైకి రయ్యి రయ్యిమంటూ పెద్ద శబ్దాలు చేసుకుంటూ దూసుకెళ్తాయి. హెల్మెట్‌ లేకుండా.. కొన్ని బైకులకు నంబర్‌ ప్లేట్లు లేకుండా ఉంటాయి. యువకులు వాటిపై స్టంట్స్‌ చేస్తారు. బైకులపై ఎక్కి కొందరు నడపగా.. ఇంకొందరు ముందరి చక్రాన్ని గాల్లోకి ఎగిరేస్తారు.

అరుపులు, కేకలతో వీరంగం సృష్టిస్తారు. ఆదివారం నల్గొండ చౌరస్తా నుంచి చంచల్‌గూడ వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఆకతాయిలు హల్‌చల్‌ చేశారు. అటువైపు వెళ్లే వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఆ వీడియోలను స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యాయి. పలువురు వాటిని పోలీసు ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. సరదా కోసమా.. బైక్‌ రేసింగ్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు.  

మరిన్ని వార్తలు